ట్వీట్లు చేయడంలో సుప్రసిద్ధుడైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... తాజాగా కొత్త రకమైన ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గత ఐదేళ్లలో ఆయన చంద్రబాబు పైనా, టీడీపీ పైనా చిత్ర విచిత్రమైన ట్వీట్లు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించేవారు. అయితే ఆ తర్వాత ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలవడంతో ట్వీట్లు చేయడం కాస్త తగ్గించుకున్న సాయి రెడ్డి తాజాగా మళ్లీ మరో ట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలు అధికారంలోకి రాక ముందు నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా గట్టి మద్దతుదారుగా ఉన్న  విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు మొదలుపెట్టారు. 

నిన్న కాకినాడ పోర్టు ఇష్యూ లో కూటమి సర్కార్ తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించే క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చిన సాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్ కంటే పవనే బెస్ట్ లీడర్ అని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చ కొనసాగుతూ ఉన్న సమయంలోనే ... పవన్ కళ్యాణ్ ను సీఎం పదవికి తగిన వ్యక్తిగా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి ఇవాళ ఎక్స్ లో సంచలన ట్వీట్ పెట్టారు. పవన్ కు జాతీయ స్ధాయిలో ప్రజాదరణ, వయస్సు ఉన్నాయని, కాబట్టి  ఏపీకి నాయకత్వం వహించడానికి, ప్రాతినిధ్యం వహించడానికి పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి అని తాను భావిస్తున్నట్లు  విజయసాయిరెడ్డి వెల్లడించారు.

కేవలం అంతటితో ఆగకుండా... ఏపీ లోని  కూటమి నాయకుల్లో పవన్ అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి  అని సాయిరెడ్డి తెలిపారు. ఏపీ వంటి కొత్త రాష్ట్రానికి  సుమారు 75 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధ నాయకుడైన చంద్రబాబు... నాయకత్వం వహించలేరని సాయిరెడ్డి పేర్కొన్నారు.  తద్వారా ఏపీ రాష్ట్రానికి పవన్ వంటి యువ నాయకత్వం అవసరమని సాయిరెడ్డి  స్పష్టత ఇచ్చేశారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై కూటమి ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : పెన్షన్ల పంపిణీ..CM Chandrababu Pension Distribution @ Palnadu | NTR Bharosa | Amaravati Gala

తాజా వార్తలు

19-43-09-0109.jpg

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ కు గుంటూరు, ప్రకాశం జిల్లాలు అనుకూలం.. ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాతో లోకేష్ భేటీ
2025-01-21 Time: 07:43:09

17-55-03-0103.jpg

ఏపీలో జడ్ఎఫ్ ఫాక్స్ కాన్ వాహన తయారీ యూనిట్ నెలకొల్పండి..! సిఇఓ ఐకీ డోర్ఫ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
2025-01-21 Time: 05:55:03

17-52-33-0133.jpg

ఇక ఆ విషయంపై మాట్లాడొద్దు - జనసేన శ్రేణులకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!
2025-01-21 Time: 05:52:33

16-43-36-0136.jpg

దావోస్ లో సిస్కో వైస్ చైర్మన్ ప్రాన్సిస్ కట్సౌదాస్ తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి..!
2025-01-21 Time: 04:43:36

16-41-00-0100.jpg

ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి..! మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాజమన్నార్ తో మంత్రి లోకేష్ భేటీ
2025-01-21 Time: 04:41:00

Related Videos