మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు ప్రతిపక్ష హోదా రాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన సీరియస్ అయ్యారు. పవన్ లక్ష్యంగా కామెంట్స్ చేసారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు కాకుండా..ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సమయంలో తామే ప్రతిపక్ష హోదా ఇచ్చామని చెప్పారు. ఈ అయిదేళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన జగన్ స్పందించారు. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ - ఎమ్మెల్యేకు తక్కువ అని వ్యాఖ్యానించారు. జీవిత కాలంలో ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారని జగన్ పేర్కొన్నారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైనా జగన్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే వారిని చరిత్రలో తొలిసారి చూసామని వ్యాఖ్యానించారు. అయినా, శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారన్నారు.

సభలో మిగిలిన మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు.. ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందో చెప్పాలన్నారు. అసలు ఎక్కడా ప్రతిపక్ష హోదాకు సంఖ్యతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 23 స్థానాలు గెలిచిన టీడీపీకి తాము ప్రతిపక్ష హోదా ఇచ్చామని గుర్తు చేసారు. అధికారంలో మీరే.. ప్రతిపక్ష పాత్ర మీరేనా.. డబుల్ యాక్షన్ చేస్తారా అంటూ నిలదీసారు. బడ్జెట్‌ లో అంతా పరనింద ఆత్మస్తుతి కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం పేరుతో అబద్దాలు చెప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదని.. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామనిని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని అన్నారు.

18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళకు ఏడాదికి 18 వేలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోటి 80 లక్షల మంది మహిళలకు ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదని.. ఒక్కో మహిళకు చంద్రబాబు 36 వేలు బకాయి పడ్డారన్నారు. బడ్జెట్‌లో కూడా తల్లికి వందనం పథకానికి గ్రాంట్స్‌లో రూ.8278 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ పథకానికి రూ.13,112 వేల కోట్లు అవసరమన్నారు. ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు రూ.30 వేలు ఎగనామం పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పీఎం కిసాన్ కాకుండా రైతులకు 20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. రాష్ట్రంలోని 53,58,266 మంది రైతులకు రూ.10,717 కోట్లు కేటాయించాలని చెప్పారు. వైసీపీ వాళ్ళకు ఏ పథకాలు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రకటించటం ఏంటని నిలదీసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos