ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఓ మీడియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కవితను ఆ ఛానల్ ప్రతినిధి క్వశ్చన్ చేస్తూ ... పవన్ హిందీ, సనాతన ధర్మ పోరాటంపై స్పందించాలని అడిగారు. దీనికి స్పందించిన కవిత చాలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ మధ్య బీసీల కోసం ఉద్యమిస్తున్న కవితను ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడిగారు. డిప్యూటీ సీఎం పవన్ చేస్తున్న హిందీపై చేసిన కామెంట్స్, సనాతన ధర్మ పోరాటం గురించి ప్రశ్న అడిగారు. అందుకు ఆమె స్పందిస్తూ... అనుకోకుండా పొరుగు రాష్ట్రమైన ఏపీకి డిప్యూటీ సీ సీఎం అయిన పవన్ కల్యాణ్ మాటలను సీరియస్‌గా తీసుకోనని.. రాజకీయాల్లో ఆయన చేసిన ప్రతీది ప్రశ్నార్థకంగా ఉంటోందని అన్నారు. పవన్ గతంలో వచించిన చెగువేర ఎటు వెళ్లిపోయాడో మరి.. ఇప్పుడు పూర్తిగా రైటిస్టుగా మారిపోయారని అన్నారు. రాజకీయంగా పవన్ ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా తనకు తానే విభేధించుకునేలా ఉంటాయని, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి రేపు తమిళనాడు వెళ్తే హిందీ అమలు చేయడానికి వీల్లేదని చెప్పినా చెబుతారని... అందుకే పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని లేదని అన్నారు. పవన్ సీరియస్ రాజకీయ నాయకుడని అనుకోవడం లేదని... అనుకోకుండా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కానీ సీరియస్ రాజకీయవేత్త మాత్రం కాదని కవిత వ్యంగ్యంగా విమర్శించారు.
ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జనసేన నాయకులు ఆమెను లిక్కర్ క్వీన్ అని ట్రోల్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ లీడర్లు గతంలో పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చేసిన కామెంట్స్‌ను కలిపి ట్రోల్ చేస్తున్నారు. ఇలా రెండు పార్టీల నేతల ట్రోల్ మెటీరియల్‌తో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. గతంలో కూడా పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిడియన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని చెబుతూ పవన్‌ను బ్రహ్మానందంతో పోల్చారు. సినిమా సీరియస్‌గా నడుస్తున్న టైంలో బ్రహ్మానందం వచ్చి నవ్వించినట్టుగానే సీరియస్ పాలిటిక్స్ మధ్యలో పవన్ కల్యాణ్ వచ్చి నవ్విస్తుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos