ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. మూడు పార్టీలు ఇదే సమయంలో సొంతంగా తమ బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కూటమి పైన పట్టు బిగించింది. తమ నేతలకు పదవులు ఇప్పించుకోవటం లో మాట నెగ్గించుకుంటోంది. ఇక, పవన్.. సొంత పార్టీలోని కొందరు ఎమ్మెల్యేల పైన వస్తున్న ఆరోపణలు... పనితీరు పైన పవన్ సీరియస్ గా ఉన్నారు. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ఏకంగా 164 సీట్లు దక్కించుకున్నాయి. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. జనసేన ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాల్లో ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో, పవన్ ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఆరా తీసినట్లు విశ్వస నీయ సమాచారం. అదేవిధంగా ఏడాది కాలంలో వారి పని తీరుతో పాటుగా ఈ ఆరోపణల పైన పవన్ పూర్తి నివేదిక సిద్దం చేస్తున్నారు.
ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరు.. వ్యవహార శైలి పై పవన్ ప్రత్యేక సర్వే చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాధమిక సమాచారం సేకరించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం.. ఇసుక, మద్యం లావాదేవీల్లో ప్రమేయం వంటి అంశాల పైన పూర్తి సమాచారంతో నివేదికలను ప్రముఖ సర్వే సంస్థ నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేల పైన పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో, పవన్ అలర్ట్ అయ్యారు. ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ మూడో వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అవినీతి.. బంధుప్రీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల పైన కఠిన చర్యల దిశగా పవన్ సిద్దం అవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో, పవన్ నిర్ణయాలు ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos