డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. మంగళగిరిలోని నివాసంలో పవన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ లేకుండానే కేబినెట్ సమావేశం కొనసాగింది. ఫిబ్రవరిలో సైతం అనారోగ్యం కారణంగా పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. పవన్ తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ తన ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను గ్రానైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకుని పగల గొట్టించుకునేవాడినని... ఇద్దరు ముగ్గురు పిల్లలను భుజాల మీద ఎత్తుకుని నడిచే అంత బలం ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తన ఆరేళ్ల కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనం అయిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ అభిమానుల ఆశీర్వాదంతో ఆ బలాన్ని మళ్లీ తెచ్చుకుంటానన్నారు.

ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయితే.. అధికారులు అప్రమత్తమై కాపాడారు. కాళ్లు, చేతులకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే పవన్ సింగపూర్ వెళ్లారు. చికిత్స అనంతరం కుమారుడిని హైదరాబాద్ తీసుకువచ్చారు. నేడు కేబినెట్ మీటింగ్ కోసం అమరావతి వచ్చారు పవన్ కల్యాణ్. అయితే వరుస ప్రయాణాల నేపథ్యంలోనే పవన్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos