ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే మాత్రం హోం మంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటానని అన్నారు. పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్దమవుతోందని, పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్  ఏజెన్సీ - పాడా పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పిఠాపురంలో చేపట్టబోయే పలు కార్యక్రమాల్ని ఆయన ఇవాళ అక్కడే ప్రకటించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వరుస అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్థానికులు అడిగిన ప్రశ్నకు ఘాటుగా స్పందించారు. తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని పవన్ వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రి గా తాను బాద్యతలు తీసుకుంటానన్నారు. ఈ ఘటనలపై హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని ఆయన కోరారు. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోరాదని పవన్ కళ్యాణ్ సూచించారు. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండన్నారు. ఆడ పిల్లల్ని రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుందని, ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకి ఏమి చెప్తుందని పవన్ అడిగారు. తెగే వరకు లాగకండని ప్రత్యర్థులకు సూచించారు.

చిన్నారులపై రేప్ లు చేస్తున్న వారిని కులం, మతం ఆధారంగా కాకుండా మనస్తత్వం ఆధారంగా చూడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇది గత వైసీపీ ప్రభుత్వ వారసత్వమని అన్నారు. గతంలో చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో దూషించారని, అప్పటి సీఎం ఆదేశిస్తే తనను చంపేస్తామని ఒకరు, తన ఇంట్లో వాళ్లను రేప్ చేస్తానని మరొకడు, తన పిల్లల్ని చంపేస్తానని ఇంకొకడు బెదిరించారని అన్నారు. అప్పుడు పోలీసులు ఒక్కరూ మాట్లాడలేదని..  పవన్ ఇంట్లో వాళ్లను ఇలా చేస్తామంటేనే మాట్లాడకపోతే వారిలో భయం పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఓ మాట చెప్తే తమ సొంత పనిలా భావించి స్పందిస్తున్న అధికారులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. 14 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురం పల్లెపండుగలో పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇసుకను అమ్ముకోవడం చాలా మందికి అలవాటైపోయిందని పవన్ ఆక్షేపించారు. ఉచిత ఇసుక అంటే ఉచితంగా ఇంటికి తెచ్చి ఇస్తారని కాదని, వ్యక్తిగతంగా బండి తెచ్చుకుని ఇసుక తీసుకుంటే మాత్రం ఇచ్చేందుకు సిధ్దమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos