కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని, వాటి పరిష్కారానికిగాను ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఏపీ డిప్యూటి సిఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం పవన్‌ మాట్లాడుతూ … అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించామన్నారు. మత్స్యకార కుటుంబాల కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనన్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా … నేరుగా అక్కడికి రాలేకపోతున్నానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని పరిష్కారం అన్వేషించాలని ఆదేశించానని పవన్‌ తెలిపారు.

ఉప్పాడ తీరంలో మత్స్యకారుల ఆందోళన తారాస్థాయికి చేరిన క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ మేరకు స్పందించారు. మందుల ఫ్యాక్టరీల కలుషితం సముద్రంలో కలుస్తుండటంతో చేపలు వలలకు చిక్కడం లేదని, మత్స్య సంపద అంతరించిపోతున్నదనే భయంతో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. ఉప్పాడ జంక్షన్ వద్ద రహదారిని దిగ్బంధం చేస్తూ, ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి 1,50,000 రూపాయల ఆర్థిక సాయం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఉప్పాడ నుంచి అద్దరిపేట వరకు విస్తరించి ఉన్న ఈ సముద్ర తీరప్రాంతం గతంలో మత్స్యకారుల ఆర్థిక జీవనానికి మూలాధారంగా నిలిచింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒకప్పుడు రాత్రి వేటకు వెళ్లి తెల్లారేసరికి వలల్లో కుప్పలు కుప్పలుగా చేపలు పడితే, ఇప్పుడు మత్స్యకారులు ఉట్టి చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రంతా సముద్రంలో గడిపినా, రెండు మూడు చేపలు మాత్రమే వలలో పడుతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడంతో అధికారులు ఎప్పటిలోగా సమస్యను పరిష్కరిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos