ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ అజెండాలోని పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దాన్ని నెత్తికెత్తుకున్నారు. ఒకటీ రెండూ కాదు ఏకంగా బీజేపీ అజెండాలోని దాదాపు అన్ని అంశాల్ని మహా ఎన్నికల ప్రచారంలో పవన్ వాడేశారు. తద్వారా బీజేపీ అజెండాను అమలు చేసేందుకు ఎంచుకున్న బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు పవన్ కనిపిస్తున్నారు. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అజెండాను పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం.. ఇలా ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా బీజేపీ అజెండాలోని ప్రతీ అంశాన్నీ ప్రస్తావిస్తూ పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సైతం ఈ మొత్తం అజెండాను నెత్తికెత్తుకునేందుకు భయపడుతున్న వేళ పవన్ మాత్రం ఏమాత్రం తడబడకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. తద్వారా పూర్తి బీజేపీ నేతగా ఆయన కనిపించారనే చర్చ జరుగుతోంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో తమ జాతీయ అజెండాను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలే తడబడుతున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో ఇదే అజెండాతో ఓట్లు అడిగి దెబ్బతిన్న ఆయా పార్టీలు.. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రయోగం చేసేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి సమయంలో పవన్ రూపంలో బీజేపీకి మంచి అస్త్రం దొరికింది. దీంతో తమ అజెండాను పవన్ తో చెప్పించడం ద్వారా సనాతన ధర్మంతో ఆయన మొదలుపెట్టిన కాషాయ అజెండా అమలును పరిపూర్ణం చేశారు.

అయితే ఇదంతా మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో జమిలి ఎన్నికలు వస్తే జాతీయ స్దాయిలో, రాష్ట్ర స్దాయిలో ఒకే అజెండాతో ముందుకెళ్లాల్సిన పరిస్దితుల్లో ఏపీలో నెగ్గాలంటే ఇలాంటి అంశాలు అవసరమని బీజేపీ భావిస్తోంది. అయితే దాన్ని ప్రచారం చేసేందుకు ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సిద్దంగా లేరు. ఇలాంటి సమయంలో పవన్ సాయంతో కాషాయ అజెండాను జనంలోకి తీసుకెళ్లి ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగూ ఏపీలో పవన్ ను సీఎం అభ్యర్దిగా గతంలోనే బీజేపీ ప్రకటించింది. రేపు పవన్ సీఎం కావాలంటే ఈ అజెండా ప్రచారం తప్పనిసరిగా మారినట్లు తాజా పరిణామాల్ని బట్టి తెలుస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos