జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తుపై కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పిఠాపురం వేదికగా పార్టీ నిర్వహించనున్న తొలి ప్లీనరీ కార్యక్రమంలో ఆసక్తికర రాజకీయ తీర్మానాల పై కసరత్తు జరుగుతోంది. ఇదే వేదిక గా పార్టీ భవిష్యత్ పైన పవన్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పార్టీ బలోపేతం తో పాటుగా ప్రభుత్వంలో భాగస్వామిగా తమ కార్యాచరణ.. లక్ష్యాలను ప్లీనరీ లో పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పై పవన్ ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు

ప్రభుత్వంలో ఉంటూనే పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు .. తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో చేసిన డిమాండ్ల పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వీటికి పార్టీ ప్లీనరీ నుంచే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన పొలిటికల్ అజెండాను పవన్ ప్రకటించనున్నారు. పార్టీ పదేళ్ల ప్రస్థానం గురించి వివరిస్తూ.. భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజకీయంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా.. ప్రభుత్వం లో ఉన్నా..లేకున్నా జనసేన రాజకీయ పాత్ర పైన పవన్ క్లారిటీ ఇస్తారని పార్టీ వర్గాల సమాచారం.


ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్న సమయంలో.. పొత్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలనే అంశం పైన పవన్ ప్రత్యేకంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో బాధ్యత కలిగిన మిత్రపక్షంగా జనసేన పాత్ర గురించి వివరించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావిస్తూనే...పార్టీ కేడర్ కు పవన్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ కేడర్ కు భరోసా కల్పిస్తూ పవన్ రాజకీయ తీర్మానం ఉండేలా చర్చలు జరుగుతున్నాయి. పిఠాపురం వేదికగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ తన రాజకీయ అజెండాను స్పష్టం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, జనసేన ప్లీనరీ వేదికగా జరిగే నిర్ణయాల పైన పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos