డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించి నేటికి ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం ప్రజల చైతన్యానికి ప్రతీక. ఐదేళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు ఓటుతో ముగింపు పలికి, ప్రజాస్వామ్య విలువలకు పునరుజ్జీవనం కలిగించారు. ప్రజల తీర్పును తాము ఎంతో బాధ్యతగా తీసుకుంటామని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

మార్గనిర్దేశకులు – మోదీ, చంద్రబాబు

ఈ విజయం సాధనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దీటైన నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, అలాగే జనసేన కార్యకర్తలు, వీరమహిళల నిరంతర పోరాటం కీలకంగా నిలిచినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 100 శాతం విజయంతో చరిత్ర సృష్టించినందుకు గర్వంగా ఉందన్నారు. “స్వర్ణాంధ్ర 2047” లక్ష్య సాధన కోసం, “వికసిత్ భారత్ 2047”లో ఆంధ్రప్రదేశ్‌ను కీలక భాగస్వామిగా నిలిపేందుకు ఎన్డీఏ కూటమి సంకల్పంతో ముందుకు సాగుతోందని పవన్ తెలిపారు. పార్టీలు భిన్నమైనా, లక్ష్యం ఒకటే – ప్రజల అభివృద్ధి. పాలనలో సమర్థత, సంక్షేమంలో నిబద్ధతతో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. ఈ చారిత్రక విజయంలో భాగస్వాములైన జనసైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నేతలందరికీ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos