పిఠాపురం :  పిఠాపురం పట్టణ, నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంతోపాటు, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ‘పీఠికాపుర వనం’ నగర వనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా నగర వనంలో మొక్క నాటి, పీఠికాపురవన ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద సుమారు రూ. 1.83 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ నగరవనం పిఠాపురం పట్టణానికి సరికొత్త హరిత సొబగులను అద్దింది. గతంలో పూర్తిగా డంపింగ్ యార్డుగా, అపరిశుభ్రతకు నెలవుగా ఉన్న ప్రాంతం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నేడు పచ్చదనపు పరిమళాలు వెదజల్లుతూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే నగరవనంగా మారింది. 

పిఠాపురంకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరవనంలో ఆహ్లాదం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా తీర్చిదిద్దారు. అందులో ముఖ్యంగా నక్షత్రవనం, శివపంచాయతన వనం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అటవీ శాఖ అధికారులు ఈ రెండింటి ప్రాధాన్యతను  పవన్ కళ్యాణ్ కు  వివరించారు. 27 నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పసన, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప తదితర రకాల మొక్కలను ఒక వరుస క్రమంలో నాటగా, ప్రతి మొక్కను ఆసక్తిగా తిలకించారు. శివ స్వరూపమైన మారేడుతో పాటు వినాయకుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యభగవానుడి స్వరూపాలైన మొక్కలను శివ పంచాయతనంగా ఏర్పాటు చేశారు. కార్తీక మాసంతోపాటు ప్రత్యేక దినాల్లో ఈ మొక్కలకు ప్రదక్షిణ చేయడం ద్వారా ఆయా దేవతల ప్రదక్షిణ పుణ్యం ప్రాప్తిస్తుందని వివరించారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, వాడుకలో ఉన్న పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.
అనంతరం 70 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్‌ను, బటర్‌ఫ్లై పార్కును, నగరవనం మధ్యన ఉన్న భారీ కొలనును ఉప ముఖ్యమంత్రివర్యులు తిలకించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను పెంచుతూ వేగంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసే విధంగా మియావకీ పద్ధతిలో చిట్టడవిని నాటారు. బాక్స్ క్రికెట్, ప్లే కోర్ట్స్ లాంటి మరిన్ని ఆకర్షణలు నగరవనానికి జోడించనున్నారు. పిఠాపురం ప్రజలతోపాటు ఆధ్యాత్మిక సందర్శనార్థం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మరింత సర్వాంగ సుందరంగా నగర వనాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గతంలో డంపింగ్ యార్డుగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉండేది? దాన్ని ఎంత కష్టపడి నగరవనంగా తీర్చిదిద్దారో వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిలకించారు. ఈ సందర్భంగా పీఠికాపుర వనాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.

 

యూట్యూబ్ లైవ్

LIVE : Sports Teachers Protest Against YSRCP | Mega DSC | స్పోర్ట్స్ టీచర్ల పోరాటం | Amaravati Galam

తాజా వార్తలు

18-19-11-0911.jpg

నిరుపేదల వైద్యానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అండ.. మెరుగైన వైద్యం కోసం బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల అందజేత
2026-09-21 Time: 06:19:11

18-02-43-0943.jpeg

శాప్ కార్యాలయంలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం.. మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా జగన్ దుష్ప్రచారం.. మంత్రి కొలుసు పార్థసారధి
2026-09-21 Time: 06:02:43

17-51-57-0957.jpg

పచ్చదనం పరిమళం..పిఠాపురంలో నగర వనాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
2026-09-21 Time: 05:51:57

17-16-45-0945.jpg

గురువుల కష్టార్జితంపై ‘ఫేక్’ ముద్ర వేస్తారా? ప్రతి ఆరోపణకూ ఆధారాలతో సమాధానం చెబుతాం.. విజయవాడ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
2026-09-21 Time: 05:16:45

17-04-22-0922.jpg

స్వర్ణ కుప్పం దిశగా అడుగులు.. పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
2026-09-21 Time: 05:04:22

Related Videos