దివ్యాంగుల పెన్షన్ల రీ-వెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను వేధిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. అనర్హులను ఏరివేసే నెపంతో, అర్హులైన దివ్యాంగుల పింఛన్లను సైతం తొలగించి వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల మానవత్వం లేదంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల స్పందిస్తూ... "బోగస్ పెన్షన్లను గుర్తించి, దొంగ సర్టిఫికెట్లతో లబ్ధి పొందుతున్న వారిని ఏరివేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. అలాంటి సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఆ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. రీ-వెరిఫికేషన్ పేరుతో ఏళ్ల తరబడి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న నిజమైన వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని" అన్నారు. ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన 1.20 లక్షల మందిలో అత్యధికులు అర్హులే ఉన్నట్లుగా తమకు సమాచారం అందిందని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన అనర్హుల జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. "వికలాంగుల జీవితాలతో రాజకీయాలు చేయడం తగదు. ప్రభుత్వం వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని" ఆమె హితవు పలికారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకోవాలని షర్మిల కోరారు. అర్హులుగా తేలిన వారి పెన్షన్లను వెంటనే పునరుద్ధరించి, వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె డిమాండ్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos