ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 41,268 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో వీర రాఘవులుపై పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. విజయానికి కావాల్సిన పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లను కూటమి అభ్యర్థి సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటి పేరాబత్తుల రాజశేఖరం విజయం సొంతం చేసుకున్నారు.  ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం మొదలైన ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం ముగిసింది. గెలుపొందిన అనంతరం రాజశేఖరం మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos