ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ, లేదా వచ్చే సమావేశాల్లో గానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. రాజధానిని 2014 నుంచి గుర్తించాలా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల వల్లే బిల్లు ఆలస్యమవుతోందని పెమ్మసాని వివరించారు. ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అమరావతి బిల్లుపై వైసీపీ అధినేత జగన్ విషం కక్కుతున్నారని, ఆయనను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పాలన చేతకాకపోవడం వల్లే 34 వేల మంది రైతులు ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకోలేక రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు.

అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే వేలాది మంది నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారని పెమ్మసాని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థలకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. త్వరలోనే హడ్కో, కాగ్, పోస్టల్ భవనం, కేంద్రీయ విద్యాలయాలు వంటివి అమరావతిలో ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos