ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి నిన్న ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేసిన వ్యక్తిని 24 గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని విజయవాడకి చెందిన నూక మల్లిఖార్జున్ గా పోలీసులు గుర్తించారు.

నిందితున్ని స్థానిక పీఎస్ కు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పేషీ నంబర్లు ఎలా దొరికాయి, ఫోన్ చేసి ఏమేం మాట్లాడాడన్న దానిపై విచారిస్తున్నారు. అయితే అరెస్టును పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విచారణలో భాగంగా కీలక విషయాలు బయటకు వచ్చినట్లు తెలిసింది. నూక మల్లిఖార్జున మానసిక పరిస్థితి సరిగా లేదని,  మద్యం మత్తులో ఇలా బెదిరింపు కాల్స్ చేశాడని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా గతంలో వైజాగ్ లో నూక మల్లిఖార్జునపై 354 కేసు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. దీంతో ఇంకా ఏయే పోలీసు స్టేషనన్లలో అతనిపై కేసులున్నాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అతను హోంమంత్రి అనితను కూడా బెదిరించినట్లు గుర్తించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్  ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర పెద్దలకు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఇప్పటికే  జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించింది. హిందుత్వ అంశాన్ని తీసుకొని ప్రజల్లో బలంగా వెళుతున్నారు. దీంతో ప్యాన్ ఇండియా స్టార్ కంటే ముందు ప్యాన్ ఇండియా పొలిటిషన్ అయ్యారు. అంతేకాదు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న పవన్ కు ... తాజాగా జరిగిన బెదిరింపు కాల్స్ నేపథ్యంలో భద్రత మరింత పెంచుతారా అనేది ఆసక్తిగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos