ఏపీలోని పల్నాడు జిల్లాలో గతంలో జరిగిన టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ కీలక నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా వీరిద్దరూ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరారు. అయితే సుప్రీంకోర్టు ఇందుకు నిరాకరించడంతో ఇవాళ మాచర్ల కోర్టులో లొంగిపోయారు. దీంతో జంట హత్యల కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకోనుంది.

గత ఏడాది పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులపై ఈ ఏడాది మే 25న కేసు నమోదైంది. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గానూ, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7గానూ ఉన్నారు. అయితే ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలిక ఊరట దక్కింది. అయితే ముందస్తు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారంటూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులకు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. దీంతో పిన్నెల్లి సోదరులకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో వారు స్ధానిక కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించారు. ఇవాళ ఈ మేరకు మాచర్ల కోర్టుకు వచ్చి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి లొంగిపోయారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపబోతున్నారు.

టీడీపీ నేతల జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత విచారణకు సహకరించాలని పిన్నెల్లి సోదరులకు షరతు పెట్టింది. కానీ సుప్రీంకోర్టు చెప్పినా పిన్నెల్లి సోదరులు విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అలాగే సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్‌ చేసే ప్రయత్నం చేశారని తెలిపింది. దీంతో వీరి ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో పాటు వెంటనే అరెస్టు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే లొంగిపోవడానికి 2 వారాలు సమయమివ్వాలన్న పిన్నెల్లి బ్రదర్స్ తరఫు లాయర్ల అభ్యర్ధనను తోసిపుచ్చింది. దీంతో వారు ఇవాళ లొంగిపోయారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos