కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కారు. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ హెలికాప్టర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన జిల్లా పర్యటనల కోసం తరచుగా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలు ఉపయోగించే హెలికాప్టర్ల భద్రత, సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం, వీఐపీలు వాడే విమానాల పటిష్టతపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుమల తిరుపతిని సందర్శించి.. తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు నిన్న ఆదివారం అమరావతిలో సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయి... పొగాకు రైతుల సమస్యలపై చర్చించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. కాగా దేశంలో విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఉత్తరాఖండ్ లోనూ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళుతున్న సమయంలో గౌరీకుండ్ అడవుల్లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos