అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో అందరూ చనిపోగా.. ఒకే ఒక్కడు సజీవంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత తాపీగా బయటకు నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌లో కూర్చున్నాడు. అతడే మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించగా.. ప్రధాని మోదీ నేడు అతడి దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పరామర్శించారు. అతని దగ్గర నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రధాని మోదీకి వివరాలు చెబుతూ ... తాను ప్రాణాలతో బయటపడటం నమ్మలేకపోతున్నానని, విమానం బయలుదేరిన నిమిషానికి ప్రమాదం జరిగిందని చెప్పారు. టేకాఫ్ సమయంలో విమానం స్పీడ్ అందుకుందని, అయితే కొన్ని సెకన్ల పాటు ఫ్లైట్ ఫ్రీజ్ అయిందని, ఆ వెంటనే అతివేగంగా కిందకు పడిపోయి మండి పోయిందని చెప్పాడు . అ వెంటనే ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయన్నారు. ఇక తాను కూర్చున్న సీటు ప్రాంతంలో కిటికీ ఉండటం, విమానం కూడా ఖచ్చితంగా గోడ అంచుకు చేరడంతో బెల్ట్ తీసి ఎగ్జిట్ గ్లాస్ పగులకొట్టి బయటకు వచ్చానన్నారు.. హాస్టల్ గోడ అంచు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని తెలిపాడు. తన ఎదురుగానే ఎయిర్ హోస్టేస్ , రెండు జంటలు ఉన్నాయని కాని ఎవరినీ కాపాడేంత సమయం లేకపోయిందని.. ప్రమాద సమయంలో 20 సెకన్లు.. తనకు కాలిన గాయాలయ్యాయని చెప్పారు.. తన సోదరుడు కూడా అదే విమానంలో ఉన్నాడని తెలిపాడు. కాగా విశ్వాస్ కుమార్ రమేష్ ను పరామర్శించిన ప్రధాని మోదీ.. మెడికల్ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా పలకరించి వారికిధైర్యం చెప్పారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos