ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ, వ్యాఖ్యలు చేస్తూ సరదాగా కనిపిస్తున్న రఘురామకృష్ణంరాజు ఇవాళ మాత్రం ఓ విషయంలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదీ ఏకంగా నిబంధనల్ని, గతంలో స్పీకర్లు ఇచ్చిన రూలింగ్స్ ను, సభా గౌరవాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అయ్యారు. అదే సమయంలో వారికి కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభకు హాజరవుతున్న ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లను వాడుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించారు. అసెంబ్లీ ప్రాంగణం, లాబీల్లో మాత్రమే కాకుండా ఏకంగా సభలోనే ఫోన్లు మాట్లాడుతూ కనిపించడంపై .. రఘురామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు సభలో ఫోన్లు మాట్లాడుతున్నారని, అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని వారికి సూచించారు.

అలాగే సభలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు తమ ఫోన్లను సైలెంట్ లో పెట్టుకోవాలని రఘురామ మరో సూచన చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు హర్ట్ కాకుండా.. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ వారికి తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో సెల్ ఫోన్ల నియంత్రణకు టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఓ సూచన చేశారు. సభలో జామర్లు పెట్టాలని డిప్యూటీ స్పీకర్ కు సలహా ఇవ్వగా... దీనిపై రఘురామ స్పందిస్తూ మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దంటూ ఆయనకు హితవు పలికారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos