ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి తండ్రి అప్పారావు స్పందించారు. తన కుమారుడు తప్పు చేశాడని అంగీకరిస్తూనే, తన మనవరాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి తక్కువ శిక్ష పడేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అప్పారావు మాట్లాడుతూ, "నా కొడుకు చేసింది తప్పే కావచ్చు. కానీ వాడికి ఒక కూతురు ఉంది. నా మీద దయతలిచి వాడిని స్టేషన్‌లో ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా బాధ అంతా నా మనవరాలి గురించే. ఆమె చాలా తెలివైనది. ఆమెను తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కోడలు కూడా తనతో మాట్లాడటం లేదని ఆయన వాపోయారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కొడుకును వదిలిపెట్టరని తనకు తెలుసని అప్పారావు అన్నారు. "చట్టానికి జాలి, దయ వంటివి ఉండవు. తప్పు చేసిన వాళ్లంతా ఒక్కటే. నా మనవరాలి కోసం కొడుకును వదిలేయరని తెలుసు. ఇప్పుడు నేను బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు" అని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కొత్త సినిమాలను పైరసీ చేస్తూ కోట్లు సంపాదించాడన్న ఆరోపణలతో రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా, అతని తండ్రి చేసిన ఈ భావోద్వేగపూరిత విజ్ఞప్తి అందరినీ కదిలిస్తోంది. 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos