ప్రధాన మోదీ అమరావతికి వచ్చేస్తున్నారు.రాజధాని పనులకు మే 2న మళ్లీ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనికోసం కనీవిని ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. 5లక్షల మంది హాజరయ్యేలా భారీ సభను నిర్వహించడానికి సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఆరు సంవత్సరాల తర్వాత రాజధాని అమరావతిలో మళ్ళీ అధికారికంగా పనులు ప్రారంభం కాబోతున్నాయి.

2019లో ఆగిపోయిన పనులు  మళ్లీ ఇన్నాళ్లకు ఊపందుకోబోతున్నాయి. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయని చాలాసార్లు ప్రచారం జరిగినా ప్రధాన మోదీ అపాయింట్మెంట్ కోసం అది లేట్ అవుతూ వచ్చింది. చివరకు మే 2న ఆయన రాబోతున్నారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు  సభ ప్రారంభం కాబోతుంది. సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి  5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు.. చేస్తున్నారు. మరో లక్ష మంది రోడ్లపై నిలబడి ప్రధాని మోదీకి స్వాగతం పలికేలా సన్నహాలు చేస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాదేశాల నుండి కార్యక్రమాన్ని వీక్షించాలా ఏర్పాటు జరుగుతోంది.

భద్రత కోసం ఎస్పీజీ పర్యవేక్షణ ఉండబోతున్నది. 250 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతుండగా.. కేవలం వేదికల కోసమే 28 ఎకరాలు రెడీ చేశారు. ప్రజల కోసం 40 ఎకరాల్లో టెంట్లు వేస్తున్నారు . ఈ టెంట్ల సామర్థ్యం 2.4 లక్షల సీటింగ్. ఇవన్నీ వాటర్ ప్ర్రూఫ్ టెంట్లు. VIP పార్కింగ్ కు 10 ఎకరాలు కేటాయించారు. 4 హెలిప్యాడ్స్ రెడీ అవుతున్నాయి. ప్రధానికి రైతులు మహిళలు  పూల వర్షంతో స్వాగతం పలకబోతున్నారు. ఏర్పాట్లు అన్ని ఏప్రిల్ 28 నాటికి  పూర్తయ్యేలా డెడ్ లైన్ పెట్టుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos