ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం జరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ముందుకు సాగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిర్మాణం పూర్తయ్యేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఈ మేరకు కేంద్ర జల సంఘం తమ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టం చేసింది. దీని పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు శనివారం నుంచే పనులు ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు యంత్రాలు, నిపుణులను సంప్రదించిన బావర్‌ సంస్థ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది.

డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థతో కలసి బావరే టీ-5 మిశ్రమాన్ని ఉపయోగించింది. ఇప్పుడూ ఇదే వాడాలని జల సంఘం ఆదేశించింది. కానీ, కాంక్రీట్‌ మిశ్రమంపై అమెరికా, కెనడా నిపుణులకు అవగాహన లేదని పీపీఏ, జల వనరుల శాఖ తో పాటుగా కేంద్ర సంస్థలు తమ అభిప్రాయం వెల్లడించాయి. గతంలో జలసంఘం బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారులు మాత్రం ఆ నిపుణుల మాటకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. వారు టీ-16 మిశ్రమాన్ని వాడాలని సూచించారు. కాగా.. అంతర్జాతీయ నిపుణులు పోలవరంపై ఇప్పటిదాకా ఇచ్చిన సలహాలన్నీ వృథాగా మిగిలిపోయాయని నిపుణులు అంటున్నారు. కాగా ఈ ఏడాది చివరిలోగా డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తిచేసి తీరాలని బావర్‌కు జలవనరుల శాఖ లక్ష్యం విధించింది. ఇప్పుడు కేంద్ర జల సంఘం ఆమోదంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన తాజా సమాచారం పైన ముఖ్యమంత్రి సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇరిగేషన్ అధికారులు ఈ మేరకు ముఖ్యమంత్రికి తాజా ప్రతి పాదన పైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా ఆలోచనకు ఆమోదం తెలిపితే.. రేపటి నుంచే పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ నిర్మాణం ఇప్పుడు ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యంలోకా పూర్తి చేసేందుకు కీలకంగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos