మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి సంబంధించి ఇవాళ మరో కీలక అడుగు ముందుకు పడింది. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా డీఎస్పీ మురళీ నాయక్ ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసి... కేసుకు సంబంధించి శనివారం విచారణకు రావాలంటూ అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. డీఎస్పీ మురళీ నాయక్ జారీ చేసిన నోటీసులు అందుకున్న ఆరుగురు సాక్షులు శనివారం విచారణకు వచ్చారు. సురేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రాజేశ్‌కుమార్ రెడ్డి, భరత్ యాదవ్, వీఆర్వో మహేశ్వరరెడ్డి డీఎస్పీ ముందు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు వివేకా కేసు పునర్విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం కృష్ణారెడ్డి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసు విచారణలో ఏం విషయాలు బట్టబయలు అవుతాయో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos