ఏపీ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఇక, ప్రజల మధ్యనే తమ బలం నిరూపించుకునేలా రెండు ప్రధాన పార్టీలు టీడీపీ - వైసీపీ నిర్ణయించాయి. ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల రాజకీయం అంచనాలకు మించి సాగుతోంది. అధికార కూటమి ఎమ్మెల్యేలను జూలై 2వ తేదీ నుంచి ప్రజల మధ్యకు పంపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఇంటింటికీ మంచి ప్రభుత్వం పై సమగ్ర చర్చ జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇదే సమయంలో అటు మాజీ సీఎం జగన్ ఈ కార్యక్రమానికి కౌంటర్ గా మరో కార్యాచరణ ప్రకటించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టో.. హామీలను గుర్తు చేస్తూ.. ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. అయిదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగేలా కార్యాచరణ ఖరారు చేసారు. దీంతో, అటు కూటమి.. ఇటు వైసీపీ నేతలు ప్రజల మధ్యకు వెళ్లటం కీలకంగా మారింది.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ మంచి ప్రభుత్వం కార్యక్రమం ఎలా నిర్వహించాలి.. ప్రజలకు ఏమేం వివరించాలన్న అంశాలను చర్చించడంతోపాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలపై సదరు సమావేశంలో అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. ఏడాది కాలంలోనే ప్రభుత్వం సాధించిన విజయాలు.. తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు ఏ విధంగా వివరించాలో చంద్రబాబు మార్గదర్శకం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసారు.

వైసీపీని ఫిక్స్ చేసే విధంగా ... టీడీపీ తమ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లటం పైన చంద్రబాబు చేసే సూచనలు కీలకం కానున్నాయి. జగన్ వరుస పర్యటనలు.. వివాదాల గురించి వివరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన సత్తెనపల్లి పర్యటన.. ముగ్గురు ప్రాణాలు కోల్పోవటం.. జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు వదలటం వంటి అంశాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఇటు జగన్ తన పైన నమోదైన కేసులో హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. జగన్ ను ఫిక్స్ చేసే విధంగా కూటమి నాయకత్వం కొత్త అడుగులు వేస్తోంది. ఇటు జగన్ కౌంటర్ రాజకీయం మొదలు పెట్టారు. దీంతో, రెండు పార్టీల మధ్య మొదలైన హోరా హోరీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos