ఏపీలో ఎమ్మెల్సీ పోరు ఉత్కంఠ పెంచుతోంది. రెండు గ్రాడ్యుయేట్.. ఒక టీచర్ ఎమ్మెల్సీ నియోజ కవర్గ ఎన్నికలకు పోలింగ్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య మెజార్టీ తో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తొమ్మిది నెలల పాలన పైన క్షేత్ర స్థాయి మూడ్ కాదుకానీ.. విద్యావంతుల్లో ఎలాంటి ఆలోచన ఉందనేది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీలో లేదు. పీడీఎఫ్ నుంచి కూటమి పోటీ ఎదుర్కొంటోంది. దీంతో.. నేడు జరుగుతున్న ఎన్నికల పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.

ఉభయ గోదావరి, కృష్ణ - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం పోలింగ్ 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. ఈ మూడు నియోజవర్గాల్లో 6,84,593మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మూడు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలు దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతుండటంతో రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ఈ ఎన్నికల కోసం ముందస్తుగానే తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నేతలను అలర్ట్ చేసారు. పవన్ సైతం కూటమి అభ్యర్ధులకు మద్దతివ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థులను నిలుపలేదు. ఇక్కడ ఏపీటీఎఫ్‌ తరఫున బరిలో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటమే కాకుండా... బహిరంగంగానూ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. పట్టభద్రుల స్థానాల్లో తలపడుతున్న ఇద్దరు టీడీపీ అభ్యర్థుల అభ్యర్థుల గెలుపు కోసం మూడు పార్టీలకు చెందిన మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉన్నా ఆ పార్టీ మద్ద తుదారులు పీడీఎఫ్ కు అనుకూలంగా ఓతూ వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ హోరాహోరీగా ఉన్నట్లు గ్రౌండ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కొనసాగాయి. దీంతో, ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos