టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత వరుసగా ఆయనకు రిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇవాళ పోసానికి భారీ ఊరట లభించింది. పోసాని కృష్ణమురళి గత ప్రభుత్వ హయాంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులోనే పోసానిని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఇంట్లో అరెస్టు చేసి తెచ్చారు. ఆ తర్వాత ఆయనపై రిమాండ్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కడప మొబైల్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో పోసాని కృష్ణమురళిని ఇదే కేసులో కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కడప మొబైల్ కోర్టు తోసిపుచ్చింది. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని కస్టడీలోకి తీసుకుని విచారించేంత పరిస్ధితి లేదని భావించిన కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అలాగే పోలీసు కస్టడీని కూడా నిరాకరించింది. మరోవైపు పోసానికి ఈ కేసులో బెయిల్ లభించినా మిగతా కేసుల్లో నిందితుడిగానే ఉంటూ రిమాండ్ లో ఉన్నారు. దీంతో ఆయా కేసుల్లోనూ పోసానికి బెయిల్ లభిస్తేనే ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోసాని తనపై నమోదైన కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos