ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు‌కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. రాజ్యంగ బద్దమైన పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్నారని, టీవీ చర్చల్లో పాల్గొంటున్నారనే ఫిర్యాదు పైన రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రఘురామ పైన వచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖలో  సూచించింది.  దీంతో.. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారింది.

రాజ్యాంగ ప‌ద‌విలో ఉంటూ పొలిటికల్ డిబేట్స్‌లో పాల్గొంటున్న రఘురామకృష్ణరాజుపై రాష్ట్రపతికి జేబీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ ఫిర్యాదు చేసారు. JBP ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించి.. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం సిఫారసు చేసింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి సీఎస్ కు పంపిన లేఖలో పిటీష‌నర్ ఇచ్చిన రిపోర్ట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని JBP అధినేత జడ శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌పై చర్యలకు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నట్లు ఆయన  వెల్లడించారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు తీసుకున్న వారు రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. రఘురామ టీవీ చర్చల్లో పాల్గొనరాదని, రాజకీయ అంశాలపై ప్రత్యక్షంగా స్పందించకూడదని .. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పార్టీ ఫిర్యాదు చేసింది. తాజాగా రాష్ట్రపతి కార్యాలయం సూచనతో రఘురామపై చర్యలు తీసుకోవాలని సిఫారసు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది. మరోవైపు ఈ లేఖ పైన సీఎస్ తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos