ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న మోదీ ఏపీకి రానున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రధాని పర్యటన గురించి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తరువాత ప్రధాని పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం కావటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపించనున్న గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లతోపాటు గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేసారు. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిగావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. విశాఖలో రైల్వే జోన్.. అమరావతి నూతన రైల్వే లైన్ పనుల ప్రారంభం ప్రధాని చేతుల మీదుగా చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ పర్యటన సమయంలోనే విశాఖ రైల్వే జోన్ పనులను సైతం ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. రైల్వే శాఖ మంత్రితో జరిగే సమావేశంలో విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభ ముహూర్తం పైన నిర్ణయం తీసుకోనున్నారు.

అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భూ సేకరణ నిధులు భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ప్రధాని పర్యటన ఖరారు కావటంతో.. కూటమి నేతలు ఈ టూర్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధాని రాక వేళ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos