ప్రధాని మోదీ ఈ నెల 16న ఏపీ పర్యటనకు రానున్నారు. శ్రీశైలం ఆలయం సందర్శనతో పాటుగా జీఎస్టీ ర్యాలీలో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. ఇదే సమయంలో ఏపీ కేంద్రంగా భారీ ప్రాజెక్టుకు అనుమతి లభించింది. రక్షణ రంగం ఏపీలో కీలక అడుగు వేయనుంది. దొనకొండ లో బీడీఎల్ సంస్థ రూ 1200 కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో సమీకృత ఆయుధ వ్యవస్థ, ప్రొపెల్లెంట్‌ తయారీ యూనిట్ కు నిర్ణయించింది. ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఆర్దిక సాయంతో పాటుగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల విషయంలో ఆసక్తి చూపుతోంది. తాజాగా ప్రతిష్ఠాత్మక సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ ప్రకాశం జిల్లా దొనకొండలో భారీ స్థాయి సమీకృత ఆయుధ వ్యవస్థ, ప్రొపెల్లెంట్‌ తయారీ యూనిట్​ను ఏర్పాటు చేయనుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కానుంది. మొదటి దశలో రూ.650 కోట్లను, రెండో దశలో రూ.550 కోట్లను వెచ్చించనుంది. మొత్తం రూ.1,200 కోట్లతో ఈ యూనిట్‌ స్థాపన జరగనుంది. ప్రొపెల్లెంట్‌ మోటార్లు, సమీకృత ఆయుధ వ్యవస్థల తయారీ, టెస్టింగ్‌ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ప్రాజెక్ట్‌ అమలు పూర్తి స్థాయిలో జరిగితే రాష్ట్రానికి రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. బీడీఎల్ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా మరో 1,000 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 1,600 మంది ఈ ప్రాజెక్ట్‌ ద్వారా లబ్ధి పొందనున్నారు. భారీ యూనిట్‌తో పాటు 200 ఎకరాల్లో ఉద్యోగుల కోసం ఆధునిక టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయనుంది. 600 కుటుంబాలకు నివాస సదుపాయాలు కల్పించేందుకు బీడీఎల్‌ ప్రతిపాదించింది. ప్రాజెక్ట్‌ కోసం 1,400 ఎకరాల భూమి అవసరమని బీడీఎల్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

దీనిలో ప్రభుత్వం తన దగ్గర ఉన్న 317 ఎకరాలను ఎకరాకు రూ.7.73 లక్షల చొప్పున కేటాయించనుంది. మొత్తం 1,346.67 ఎకరాలను ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. సెన్సర్లు, కమ్యూనికేషన్‌ పరికరాలు, క్షిపణులు, తుపాకులు వంటి వివిధ ఆయుధ వ్యవస్థలను సమన్వయ పరిచే ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ తయారీ ఈ యూనిట్‌లో ప్రధానంగా జరుగుతుంది. 2028 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, అదే ఏడాది సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos