ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ... హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు స్వగ్రామం నారా వారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. మరికొందరు సోషల్ మీడియాతో పాటు నేరుగా కూడా సంతాప సందేశాలు పంపారు.

ఇదే క్రమంలో ప్రధాని మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అంతటితో ఆగకుండా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ కు ఓ లేఖ రాశారు. ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి నుంచి రోహిత్ కు లేఖ రాశారు. రామ్మూర్తి నాయుడు మరణంపై ప్రధాని మోదీ ఈ లేఖలో ఎమోషనల్ గా స్పందించారు. రామ్మూర్తి నాయుడు చనిపోయారని తనకు తెలియగానే తీవ్ర ఆవేదన చెందానని, ఆ లోటు ఎవరూ తీర్చలేనిదని మోదీ ఆవేదన చెందారు. ప్రజా ప్రతినిధిగా రామ్మూర్తి నాయుడు ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నించారని వెల్లడించారు.

ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని, ఆ ప్రభావం ప్రతీ ఒక్కరిపై ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే రామ్మూర్తి నాయుడు అనుసరించిన విలువల ప్రభావం ఆయన కుటుంబంపైనా ఉంటుందన్నారు. ఆయనతో మీ కుటుంబం గడిపిన క్షణాలు ఇలాంటి బాధాకరమైన సమయంలో గుర్తుకొస్తాయన్నారు. ఆయన మీ కుటుంబానికి, స్నేహితులకు, హితులకు దూరమైన వారి హృదయాల్లో మాత్రం కలకాలం ఉండిపోతారని.. ఈ క్రమంలో మీ కుటుంబానికి నా ప్రగాడ సంతాపం, సానుభూతి తెలుపుతున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos