జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులు కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తమ ఫోటోలను, వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (AI) సాయంతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప‌వన్ పిటిష‌న్‌ని శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం అవుతున్న లింకులను 48 గంటల్లోగా తమకు అందించా లని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా, ఆ లింకులపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను వీడియోలను ఉపయోగించి AI ద్వారా సృష్టించిన తప్పుడు కంటెంట్‌ను తొల‌గించాల్సిన‌ అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల అంటే డిసెంబర్ 22కు వాయిదా వేసింది. కాగా డిప్యూటీ సీఎం పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి.

రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయన్ను దెబ్బతీసేందుకు కొందరు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున, తారక్ సహా పలువురు ప్రముఖులు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయించారు. తమ పేరు, ఫొటోలు, వాయిస్ ను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో, ఇప్పుడు పవన్ పిటిషన్ విషయంలోనూ న్యాయస్థానం తగిన చర్యలకు ఆదేశించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos