ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. నిన్న బుధవారం పోలవరం పర్యటన ముగించుకున్న వెంటనే హుటాహుటిన దేశ రాజధానికి చేరుకున్న ఆయన, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గత పర్యటనలో అమిత్ షా ను కలవలేకపోయినందున ఇప్పుడు సమావేశమయ్యారు. ఈసారి షా ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. ఇది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికాంశాలు, ప్రాజెక్టుల పురోగతితోపాటు రాజకీయ అంశాలపై లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించిన అంశం అమరావతి రాజధానికి చట్టబద్ధత. రాజధానిగా అమరావతికి కేంద్రం పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించేలా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ముఖ్యంగా 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా నిర్ణయించాలని ఆయన అభ్యర్థించారు. దీని వెనుక బలమైన ఆర్థిక వ్యూహం ఉంది. గత ఐదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం చట్టబద్ధత కల్పిస్తే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఒక భరోసా లభిస్తుందని, తద్వారా అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతుందని చంద్రబాబు వివరించారు. రాబోయే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ఇచ్చే వాటాను పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.  పోలవరం ప్రాజెక్టుతోపాటు నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి మద్దతు ఇవ్వాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతూనే ముఖ్యంగా రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. 

కేవలం అభివృద్ధి పనులే కాకుండా రాజకీయ అంశాలపై కూడా ఇద్దరు నేతల మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  త్వరలో జరగబోయే కేంద్రమంత్రి విస్తరణ గురించి, ఇందులో కూటమి పార్టీగా టీడీపీకి స్ధానం లభించే  అవకాశాలపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కేసు పురోగతి గురించి, ఇందులో మాజీ సీఎం జగన్ పాత్ర గురించి ఉన్న వివరాలను కూడా చంద్రబాబు కేంద్రానికి సమర్పించినట్టు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos