ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు గ్రాడ్యుయేట్.. ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఒక సీటు కూటమి ఇప్పటికే గెలవగా.. మరో సీటులో గెలుపు దిశగా వెళ్తోంది. అనూహ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ సీటు మాత్రం పీఆర్టీయూ గెలిచింది. కాగా, ఇక్కడ కూటమి రఘువర్మకు మద్దతు ఇచ్చింది. అయినా.. తాము ఓడినట్లు కాదని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగాయి. 2024 లో కూటమి రెండు మినహా ఈ సీట్లలో విజయం సాధించింది. కూటమికి 2024 ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు పాల్గొన్న ఎమ్మెల్సీ ఫలితాలు మాత్రం కూటమికి అలర్ట్ గానే మారుతున్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గంలో టీడీపీ - జనసేన మద్దతు ఇచ్చిన రఘువర్మ ఓడిపోయారు. అయితే, పీఆర్టీయూ అభ్యర్ధి శ్రీనివాసులునాయుడుకు బీజేపీ మద్దతుగా నిలిచింది. ఇప్పుడు శ్రీనివాసులు నాయుడుకే తాము మద్దతు ఇచ్చామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే రఘువర్మకు మద్దతుగా టీడీపీ, జనసేన మద్దతుగా ప్రచారం చేసిన వీడియోలను వైసీపీ బయట పెడుతోంది.

ఈ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో పది మంది పోటీ చేయగా.. ఎనిమిది మందిని ఎలిమినేట్‌ చేయడంతో శ్రీనివాసులు నాయుడు గెలిచారు. ఉత్తరాంధ్రలో మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లాయి.. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. గాదె శ్రీనివాసులు నాయుడు మూడోసారి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. గతంలో 2007, 2013లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రఘువర్మపై రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos