విజ‌య‌వాడ జైలులో ఖైదీగా ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌, సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ పీఎస్ఆర్ ఆంజ‌నేయులును సీఐడీ క‌స్ట‌డీలోకి తీసుకుంది. ఆదివారం ఆయ‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో విచార‌ణ కొన‌సాగ‌లేదు. ఈరోజు విజ‌య‌వాడ జీజీహెచ్‌లో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం క‌స్ట‌డీలోకి తీసుకున్న అధికారులు తాడిగ‌డ‌ప‌లోని సీఐడీ కార్యాల‌యంలో ఆయ‌న‌ను విచారిస్తున్నారు. మూడు రోజుల పాటు (ఆది, సోమ‌, మంగ‌ళ‌వారం) ఆయ‌న్ను సీఐడీ క‌స్ట‌డీకి అనుమ‌తిస్తూ ఇటీవ‌ల విజ‌య‌వాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ముంబ‌యి న‌టి కాదంబ‌రి జెత్వానీపై అక్ర‌మంగా కేసు బ‌నాయించార‌నే ఆరోప‌ణ‌లతో పీఎస్ఆర్‌పై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. సీఐడీ అధికారులు విచారణలో బాగంగా కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నారని తెలిసింది. ఇందులో, పీఎస్ఆర్ ఆంజనేయులపై ఉన్న ఆరోపణలు, కేసు నమోదుకు కారణాలపై లోతుగా దర్యాప్తు  చేస్తున్నారని తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా... పీఎస్ఆర్ ఆంజనేయలు వద్ద గత ప్రభుత్వ పెద్దల గుట్టు చాలా ఉందని, లిక్కర్ స్కాం నిందితుల్ని ఆయన కాపాడే ప్రయత్నం చేశారని పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో విధుల్లో ఉన్నప్పుడు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. వీటికి సంబంధించిన అంశాల్లోనూ సీఐడీ అధికారులు సమాచారం రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వారి విచారణలో ఎలాంటి కీలక అంశాలు బయటపడతాయో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos