ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో మాజీ మంత్రి పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కోట్ల విలువైన క్వార్ట్జ్ (Quartz) దోపిడీ చేశారని ఆరోపణలు రావడంతో మాజీ మంత్రి కాకాణి సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తు మైన్స్ లీజు ముగిసినప్పటికీ అక్రమంగా క్వార్ట్జ్ తరలించారని ఆయనపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. మాజీ మంత్రి కాకాణిని ఏ4గా చేర్చారు.
రుస్తుం మైన్స్‌కు సంబంధించిన లీజు గడువు ముగిసిపోయినా మైనింగ్ చేశారు. అప్పట్లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. విచారణ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మైనింగ్ శాఖ అధికారులు దొంగతనం అయిన క్వార్డ్జ్ విలువను లెక్కించారు. రూ.250 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు కట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలావుండగా.. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో విచారణ జరుగుతోంది. మరో వైపు గతంలో సోమిరెడ్డి తప్పుడు కేసుల్లో ఇరికించడానికి తప్పుడు పత్రాలు సృష్టించి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేసిన వ్యవహారంలో కూడా ఆయనపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ సాక్ష్యాలను కోర్టు నుంచి దొంగతనం చేశారు. మొత్తానికి కాకాణికి మున్ముందు అరెస్టు ముప్పు తప్పదని వార్తలు వస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos