ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఆయినా పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని ఆ పార్టీ నేతలు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా జగన్ రెంటపాళ్ల పర్యటన విషయంలోనూ తగిన భద్రత కల్పించకపోవడం వల్లే వైసీపీ కార్యకర్త సింగయ్య ఆయన కాన్వాయ్ కింద పడి చనిపోయారని ఆరోపించారు. ఈ కేసులో ప్రభుత్వం జగన్ సహా ఇతరులపై పెట్టిన కేసులపై దర్యాప్తును నిలిపేస్తూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే జగన్ తాజాగా నెల్లూరు పర్యటనకు వెళ్లాలని నిర్ణయించి చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే జగన్ నెల్లూరు టూర్ లో హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని, జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్ కు పోలీసులు తగిన భద్రత కల్పించడం లేదని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చిన సందర్బంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. దీంతో వారు కేంద్రం మార్గదర్శకాలను హైకోర్టుకు సమర్పించబోతున్నారు. అనంతరం వీటిని పరిశీలించి అసలు జగన్ కు ఈ మార్గదర్శకాల ప్రకారం భద్రత లభిస్తుందో లేదో హైకోర్టు తేల్చబోతోంది. ఇది తేలితే జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జడ్ ప్లస్ భద్రత కల్పించారా లేదా అనేది కూడా తేలిపోనుంది. దీంతో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కీలకంగా మారాయి. వాస్తవానికి జగన్ నెల్లూరు టూర్ వాయిదా వేసుకున్న నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ నిరర్ధకం అవుతుందని, దీన్ని కొట్టేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే ఈ నిర్ణయానికి కారణమైన నేపథ్యం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించకపోవడమే కాబట్టి దీనిపై విచారణ జరిపి తగు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ పిటిషనర్లు కోరుతున్నారు. న్యాయస్థానం ఏం తేలుస్తుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos