ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తాత్కాలిక బడ్జెట్ సమర్పించిన తర్వాత స్పీకర్ దీనిపై ఎమ్మెల్యేలకు ఓ కీలక సూచన చేశారు. ఎమ్మెల్యేలంతా బడ్డెట్ పై అవగాహనతో ఉండాలని, ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలు బడ్జెట్ గురించి అన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలని కోరారు. ఈసారి అసెంబ్లీలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 84 మంది ఉన్నారని స్పీకర్ తెలిపారు. రెండోసారి ఎన్నికైన వారు 39 మంది ఉన్నారని, మిగిలిన వారు మాత్రం పలుమార్లు ఎన్నికయ్యారన్నారు.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ పై పూర్తి అవగాహన ఉండాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎల్లుండి బడ్జెట్ పై జరిగే చర్చలో వీరంతా పాల్గొనాలని, అలాగే తప్పనిసరిగా అవగాహన తెచ్చుకుని మాట్లాడాలని కోరారు. రేపు సభకు సెలవు ఉంటుందని, అనంతరం జరిగే చర్చలో పాల్గొనాలని కోరారు. మధ్యలో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు ఏదో మాట్లాడబోయారు.

దీనికి స్పందనగా స్పీకర్ అయన్నపాత్రుడు.. రాజుగారూ.. వింటున్నారా మీరు కూడా బడ్జెట్ పై అవగాహన తెచ్చుకుని 13వ తేదీన జరిగే చర్చలో మాట్లాడాలని కోరారు. అందుకే రఘురామ కూడా సరేనన్నారు. దీంతో ఎల్లుండి జరిగే చర్చలో తొలిసారి రఘురామ ప్రసంగం చేయబోతున్నారని అర్ధమైంది. ఇందులో ఆయన బడ్డెట్ లో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ రాజకీయాల ద్వారా లేకపోతే కేసుల ద్వారా వార్తల్లో నిలిచిన రఘురామ ఈసారి బడ్జెట్ పై చర్చల్లోకి రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos