దేశంలో వ్యవస్థీకృతంగా 'ఓట్ల దొంగతనం' జరుగుతోందని, ఈ కుట్రకు పాల్పడుతున్న వారిని సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఎలా తొలగిస్తున్నారో ఆధారాలతో సహా వివరించారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఘటనను ఆయన ఉదాహరణగా చూపించారు. అక్కడ ఏకంగా 6,018 ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని రాహుల్ ఆరోపించారు. "ఇది అనుకోకుండా బయటపడిన ఒక ఉదంతం మాత్రమే. అలంద్‌లో మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారో మాకు తెలియదు. కానీ 6,018 ఓట్ల తొలగింపు వ్యవహారం మాత్రం పట్టుబడిందని" ఆయన తెలిపారు.  ఈ కుట్ర ఎలా బయటపడిందో వివరిస్తూ "ఒక బూత్ లెవెల్ అధికారి తన బంధువు పేరు ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంతో ఆరా తీశారు. ఆమె బంధువు ఓటును ఒక పొరుగు వ్యక్తి దరఖాస్తు ద్వారా తొలగించినట్లు రికార్డుల్లో ఉంది. ఆ పొరుగు వ్యక్తిని అడగ్గా, తనకేమీ తెలియదని, తాను ఏ దరఖాస్తు చేయలేదని చెప్పారు. అంటే, ఓటు తొలగించిన వ్యక్తికి తెలియదు, ఓటు పోగొట్టుకున్న వ్యక్తికీ తెలియదు. మధ్యలో మరేదో శక్తి ఈ ప్రక్రియను హైజాక్ చేసి ఓట్లను తొలగించిందని" రాహుల్ వివరించారు.

ఈ సందర్భంగా బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "నేను ఈ మాటను తేలిగ్గా అనడం లేదు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా చెబుతున్నాను. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓట్ల దొంగలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇది పచ్చి నిజం, ఇందులో ఎలాంటి గందరగోళం లేదని" ఆయన తీవ్రంగా ఆరోపించారు. గతంలో తాను చెప్పినట్లుగా త్వరలోనే 'హైడ్రోజన్ బాంబ్' లాంటి బలమైన సాక్ష్యాలను బయటపెడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈరోజు చూపించింది కేవలం దాని ట్రైలర్ మాత్రమేనని, అసలు విషయం ముందుందని ఆయన పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos