గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం శుక్రవారం లాంచ్ చేశారు. ఆయన పెట్ డాగ్ రైమ్‌తో కూడిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరు 4 రోజుల క్రితమే లండన్ చేరుకున్నారు. విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా లండన్‌లో చరణ్ ఫ్యాన్స్ సందడి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్‌లతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చరణ్ మైనపు విగ్రహం లాంచ్ కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు. ఎంతో గౌరవం, గర్వంగా భావించే ఈ జాబితాలో చరణ్ చేరడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు. శాశ్వతంగా అక్కడే ప్రదర్శనకు ఉంచుతారు. ఈ ఈవెంట్ కోసం లండన్ చేరుకున్న మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. ఈ నెల 11న ఫేమస్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'RRR' సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ కీరవాణితో RRR సాంగ్స్ ఆర్కెస్ట్రా నిర్వహించిన తర్వాత రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్‌లతో క్వశ్చన్స్, ఆన్సర్స్ కార్యక్రమం కూడా ఉండనుందని సమాచారం. దీంతో ఆ ఈవెంట్ అయ్యే వరకూ చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు అక్కడే ఉండనున్నారు.
అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారు. ఇప్పటికే ఇండియాకు చెందిన ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలను టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. బాహుబలి మూవీ నుంచి ప్రభాస్ రోల్‌ను పోలి ఉండేలా రెబల్ స్టార్ విగ్రహం తయారుచేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో చరణ్ చేరిపోయారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos