దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అడ్వకేట్ జనరల్ (ఏజీ) వచ్చి వాదనలు వినిపిస్తారని, కాబట్టి తమకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టుల వ్యవహారంలో ఇక ముందు ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఆదేశించాలని కోరుతూ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెట్టారన్నారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారని ఆర్జీవీ తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు కాకుండా చూడాలని కోరారు. అయితే, ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, కాబట్టి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు హైకోర్టు కూడా అంగీకరించింది.

ఇదిలా ఉండగా, రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. తాను కేసులకు భయపడటం లేదని వెల్లడించారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నానని... అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos