ఏపీలో అమరావతి లోని సికే కన్వెన్షన్ హాలు లో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సభను ఇవాళ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నానని, పల్లెల్లో ఉండడం అంటే తనకు ఇష్టమని తెలిపారు. పల్లె నిధులు వాటికే ఉపయోగించాలని చెప్పారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బిల్లులు రాక పోయినా పనులు చేసిన గుత్తేదారులకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మందికి పైగా కార్మికులకు నిధులు ఇచ్చామని పవన్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో 'కూలీ' అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని ఆయన సూచించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గతంలో చాలా తండాలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. అడవితల్లి బాటలో భాగంగా రూ.1001 కోట్లతో సుమారు వెయ్యి కిలోమీటర్ల నిర్మించాం. 9 నెలల కాలంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ 24వ స్థానం నుంచి 2వ స్థానానికి వచ్చింది. చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి. గ్రామ పంచాయతీలు ఆర్థిక బలోపేతం స్థానిక ప్రభుత్వాలుగా మారాలి. పంచాయతీలపై ఆడిట్ జరగాలి. పంచాయతీలో ఉన్న భూమి, భవనాలపై ఆడిట్ చేయాలి. ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత స్థూపాలు, ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నేను మాట్లాడతా..దాని కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని  పవన్ పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos