మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ సాంకేతికంగా అది వివేకా హత్య కేసు కాదు. వివేకా పీఏ కృష్ణారెడ్డి పెట్టిన తప్పుడు కేసుపై విచారణ. సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని గతంలో వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డితో తప్పుడు కేసులు పెట్టించారు. ఇప్పుడు ఆ కేసులపై కోర్టు మరింత లోతుగా విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విచారణ ప్రారంభించారు. వైఎస్ జగన్ బంధువులు.. ముఖ్యంగా అవినాష్ రెడ్డి బంధువులకు రాష్ట్ర పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇటీవల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. ఆయన ఏం చెప్పారో బయటకు తెలియలేదు కానీ పోలీసులు మాత్రం చాలామందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా గత ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఘోరం అంటే సీబీఐ అధికారులపైనే దాడులు చేయడం.. వారిపైనే ప్రైవేటు కేసులు పెట్టించడం. ఇలాంటి కారణాల వల్ల విచారణ ఎంతో కాలం  ఆగిపోయింది.

ఇప్పుడు అందులో ఉన్న కుట్ర కోణాలన్నీ వెలుగులోకి వస్తాయి. నిజానికి వివేకా హత్య కేసులో అసలు విచారణను సీబీఐ ఆపేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మేరకు విచారణ చేసింది. ఇంకా పెంచాలన్న అభ్యర్థనపై నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగా అటు విచారణ.. ఇటు కోర్టుల్లో ట్రయల్ జరగడం లేదు. ఈ లోపు నిందితులు అందరూ బెయిల్ పై బయటకు వచ్చారు. అవినాష్ రెడ్డి తండ్రి చాలా కాలం జైల్లో ఉన్నారు కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఇలా అరెస్టు అయి అలా జైలుకు వెళ్లకుండానే బయటకు వచ్చేశారు. అంతా పేపర్ల మీద జరిగిపోయింది. ఇప్పుడు సీబీఐ అధికారిపై పెట్టిన దొంగ కేసుల్లో విచారణతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఈ వివరాలు ... అసలు హత్య కేసు విచారణలోనూ కీలకంగా మారనున్నాయి. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos