రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస ... త్వరలో జరుగనున్న నాలుగో ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి జరగనున్న ఎలెక్షన్స్ పలాసకు నాలుగో ఎన్నికలు కావడం గమనార్హం. పలాస నియోజకవర్గం ఏర్పాటై 15 ఏళ్లు మాత్రమే అవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో పలాన నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ మూడు ఎన్నికలు జరగ్గా, ఒకసారి కాంగ్రెస్‌, మరోసారి టీడీపీ, ఇంకోసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గత ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గం ఏర్పాటైన తరువాత ఇక్కడి నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న తొలి వ్యక్తిగా అప్పలరాజు నిలిచారు. దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన ఉద్దానం సమస్య ఈ ప్రాంతంలోనే ఉంది.  పలాస నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. వీటిలో పలాస ఒకటి కాగా, మందస, వజ్రపుకొత్తూరు మిగిలిన రెండు మండలాలు. పలాస  రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు వర్సెస్ టీడీపీ ఇన్‌ఛార్జి గౌతు శిరీష మధ్య పోటాపోటీ రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా వైసీపీలో గ్రూపుల గోల ఉంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న వారంతా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్లంతా మంత్రి సీదిరి అప్పలరాజును టార్గెట్ చేస్తున్నారు. మంత్రి వైఖరితో నాలుగేళ్లు విసిగిపోయామంటున్నారు. వైసీపీకి మొదటి నుంచి దన్నుగా ఉన్న మూడు మండలాల్లోని కీలక నాయకులంతా మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇప్పుడు వారి చూపు టీడీపీ వైపు పడినట్లుగా కనిపిస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నాయకులు వైసీపీలో అసమ్మతి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అసమ్మతి నేతలు టీడీపీలో చేరితే సీదిరి అప్పలరాజుకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా టాక్ వినిపిస్తోంది. అసమ్మతినేతలను కలుపుకునేందుకు సిదిరి నుంచి ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదని తెలుస్తోంది. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనేది ఉత్కంఠగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos