ఏపీ రాష్ట్రానికి కొత్త డీజీపీ రాబోతున్నారు. ఈ నెల 31తో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డీజీపీగా ద్వారకా తిరుమలరావు పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తారనే ప్రచారం ఉంది. మరోవైపు హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ కోసం కసరత్తు చేస్తున్న తరుణంలో ఓ పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డీజీపీ ఎంపికలో సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదని ఏపీ హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పును వెలువరించింది. తీర్పు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కోర్టు పిటిషనర్‌కు సూచించింది.
కాగా కొత్త పోలీస్ బాస్‌పై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగు తోంది. నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉండగా... హరీశ్ కుమార్ గుప్తా రెండోస్థానంలో ఉన్నారు. అయితే హరీశ్ కుమార్ గుప్తాకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది.
ఒకవైపు డీజీపీగా శాంతిభద్రతల విషయంలోనూ.. ఇటు ఆర్టీసీ ఎండీగానూ ఆర్టీసీని లాభాలబాట పట్టించడంలోనూ సక్సెస్ అవ్వడంతో తిరుమలరావును ఏపీ డీజీపీగా కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. డీజీపీగా ఏడాదిపాటు కొనసాగించేలా అవకాశం ఇవ్వాలని కేంద్రహోంశాఖను కోరే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos