ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భారీగా నిర్వహించబడ్డాయి. వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాలు రేపరేపలాడుతూ ఆత్మగౌరవాన్ని చాటుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ జాతీయ జెండాలతో నిండిపోయాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాలు భారీ అప్పుల ద్వారా రాష్ట్రంలో పలు సమస్యలు సృష్టించాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ఎంతో బలంగా పనిచేసిందన్నారు. స్వర్ణాంధ్ర దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలకు ఆరోగ్యం, సంపత్తి, ఆనందం అందించడానికి తమ ప్రభుత్వానికి నినాదం ఇదేనని తెలిపారు. ప్రభుత్వ పది సూత్రాల ద్వారా లక్ష్యాలు సాధించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos