ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్లాన్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కోసం కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు శక్తికి మించి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలను మనం కాపాడుకోవాలని, ఆ దిశగా పని చేయాలని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు.
శుక్రవారం ఉండవల్లి లోని నివాసంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. అక్టోబర్ 26వ తేదీ నుంచి పార్టీ సభ్యత్య నమోదు మొదలు పెడతామని చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు చెప్పారు. వంద రూపాయలు చెల్లించి పార్టీ సభ్యత్వం సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షల రూపాయలు ప్రమాద భీమా ఇస్తామని, వారి కుటుంబ సభ్యులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చంద్రబాబు ఆ పార్టీ నాయకులకు చెప్పారు.
అలాగే ప్రమాదంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల విద్య, వైద్యం కోసం అయ్యే పూర్తి ఖర్చులు మేమే భరిస్తామని, వారికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు పార్టీ నాయకులకు చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో ఉండాలని, ఆ దిశగా ప్రతి నాయకుడు పనిచేయాలని సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు.
ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నామని, మన పార్టీలో చేరడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారని, గతంలో ఉన్న పార్టీ కార్యకర్తలే కాకుండా ఇతరులను కూడా పార్టీలో చేర్చేలా నాయకులు ప్రయత్నించాలని చంద్రబాబు నాయుడు సూచించారని తెలిసింది. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని, కష్టపడి పనిచేసే నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు పార్టీ నాయకులకు హామీ ఇచ్చారని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos