విజయవాడ :  కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును 2014 నుండి అధికారంలో ఉన్న ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం మనువాద ధ క్పథంతోనే అమలు చేయడానికి ఇష్టపడటం లేదని, ఇటీవల పెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో బిజెపి, టిడిపి చేస్తున్న కుట్రలను ప్పు్రల్లోకి తీసుకెళతామని వామపక్ష పార్టీల నాయకులు ప్రకటించారు. ఈ సందర్బంగా.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... మహిళా రిజర్వేషన్ అమలు చేసే ఆలోచన బిజెపి, ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని తెలిపారు. అందులో భాగంగానే డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ లింకుపెట్టి బిల్లు పాసవదని తెలిసినా పార్లమెంటులో ప్రవేశపెట్టారని తెలిపారు. అలాగే తమిళనాడు, బెంగాల్లో ఓడిపోతామని తెలిసి బిల్లుపేరుతో కొత్త నాటకానికి మోడీ తెరతీశారని అన్నారు. మోడీకి చంద్రబాబు తోడు అయ్యారని, హిందూ ధర్మం గురించి ఆరఎసఎస్ వాదిలాగా పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌పై ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని తెలిపారు. పార్లమెంటులో టిడిపి పక్షనేత లావు శ్రీక ష్ణదేవరాయలు మాట్లాడుతూ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారని, 2023లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్రకుమార్  మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌కు ముడిపెట్టవద్దన్నారు. కానీ ఇప్పుడు టిడిపి వైఖరి రివర్స్ అయిందన్నారు. ఇప్ప్పుడేమో బిజెపి, ఎన్‌డిఏ కూటమికి టిడిపి, జనసేన తాళం వేస్తున్నాయని విమర్శించారు. వాస్తవంగా 2010లో మహిళా ర్పుిర్వేషన్ బిల్లును అడ్డుకుంది బిజెపి సభ్యులేనని అన్నారు. ఇప్ప్పుడు ప్రతిపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని చెబుతున్న మోడీ 2019లో పూర్తి మెజార్టీ ఉన్నా బిల్లు ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు. 2023లో ఆమోదం పొందిన బిల్లును ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. 2021లో  కరోనా వల్ల సెన్సస్ నిలిపేస్తే 2023లో చక్కబడిన తరువాత ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సెన్సస్ జరిగితే ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు సీట్లు పెంచాల్సి వస్తుందని, వాటిని పెంచడానికి ఇష్టం లేక 2011 సెన్సన్ ప్రకారం డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా ఎపి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం సెన్సస్‌తో సంబంధం లేకుండానే 225 సీట్లు రావాల్సి ఉందని, అది జరగనందున ఇప్పుడు 75 అదనంగా నష్టపోతున్నామని ఇప్ప్పుడు 175లో 50 శాతం పెరిగితే 263 అవుతాయని, 88 సీట్లు పెరుగుతాయని చెబుతున్నారని అన్నారు. 50 శాతం పెంచాలని బిల్లులో ఎక్కడా లేదని తెలిపారు. తన పలుకుబడిని ఉపయోగించి 225 చేసి అందులో 50 శాతం పెరిగితే 338 సీట్లు వచ్చేవని అన్నారు. అంటే 75 సీట్లు కోల్పోతామని తెలిపారు. ఏదోరకంగా మహిళా రిజర్వేషన్ అమలు జరగకుండా అడ్డుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ సీట్లు పెంచాలి అనుకుంటే ప్రతిపక్షాలతో సంప్రదించి చేయాలని అలాచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తప్ప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ వీగిపోవడంతోనే చంద్రబాబు అప్పటికప్ప్పుడే ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీ చేశారని అన్నారు. అప్పటి కప్ప్పుడు ప్రధాని జాతిని ఉద్దేశించి దూరదర్శన్‌లో ప్రసగించారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనని, ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వానికి తాబేదారుగా పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో పార్లమెంటు ప్రాబల్యం కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. దూరదర్శన్‌లో మాట్లాడటానికి ప్రధానికి అవకాశం ఇస్తే ప్రతిపక్షాలకు కూడా ఇవ్వాలని అన్నారు, పార్లమెంటులో జరిగిన నిర్ణయంపై బహిరంగంగా టివిలో ప్రసగించడం అంటే పార్లమెంటును అవమానించడమేనని తెలిపారు. మనువాద కుట్రలను వామపక్షాలు ఎదుర్కొంటాయని, అందుకు ప్రజల్లోకి వెళతామని అన్నారు. 543 సీట్లలో రిజర్వేషన్ అమలు చేసినా మహిళలకు 180 సీట్లు ఉండేవని, డీలిమిటేషన్లో మరిన్ని పెరిగేవని అన్నారు. దీనికి రాష్ట్రంలో టిడిపి, వైసిపి కూడా మోడీకి వంతపాడాయని అన్నారు. ఈ విషయంలో వైసిపి మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి, వైసిపి 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించినా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. అందువల్లే వామపక్షాలుగా ప్రత్యామ్నాయ గళంవినిపించేందుకు ప్రజల ముందుకు వస్తున్నామని తెలిపారు. మహిళా రిజర్వేషన్లను బలపరిచి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ మోడీ నటన సినిమా యాక్టర్లను మించిపోయిందని అన్నారు. గతంలో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా కొత్తగా పెట్టిన మూడు బిల్లుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది లేదని, ఇదొక కట్రని పేర్కొన్నారు. బిజెపికి, ఎన్‌డిఏకి  ఈబిల్లు ఆమోదం పొందదని తెలుసన్నారు. ఎన్నికల సమయంలో విపక్షాల సభ్యులు ఆయా రాష్ట్రాల్లో ఉంటారని, అయినా మోడీ ఎవరితో సంప్రదించకుండా బిల్లును పెట్టారన్నారు. వీగిపోయిన వెంటనే ప్లకార్డులు పెట్టుకున్నారని, అంటే ముందుగానే వారికి బిల్లు వీగిపోతుందని తెలుసన్నారు. 2014 నుండి 2023 వరకూ మహిళా బిల్లు ఊసేలేదని అన్నారు. పెద్దఎత్తున పోరాటం చేయడంతో తప్పనిసరిగా 2023లో బిల్లు పెట్టారన్నారు. దీనికి సెన్సన్, డీలిమిటేషన్ లింకు పెట్టారని అన్నారు.
సిపిఐ(యంఎల్) లిబరేషన్ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ మహిళలంటే బిజెపికి చిన్నచూపని, అద్వానీకి సన్మానం సమయంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు కనీసం కుర్చీ కూడా లేకుండా ప్రధాని ముందు నిలబెట్టారని అన్నారు. మోడీకి ప్రతిపక్షం అంటే బయం పట్టుకుందని ఇండియా కూటమి ఏర్పడని సమయంలో భారత్ అనిపేరుమార్చి వారి భయాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు.

Related Videos