టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని, ఎవరూ చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాడులు, ప్రతిదాడులు మన సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

టెలికాన్ఫరెన్స్‌లో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవలి పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. "గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగించిన అరాచకాలను మనం వ్యతిరేకించాం. ఇప్పుడు మనమే అలా ప్రవర్తించడం సరికాదు. సోషల్ మీడియాలోని ప్రేరణలకు లోనై స్పందించవద్దు. చట్టాన్ని గౌరవించడమే మన పార్టీ బ్రాండ్ ఇమేజ్" అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి లభించిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతికి రూ.1,088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.500 కోట్లు కేటాయించడం వంటి అంశాలను వివరించాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. "టీడీపీని రాజకీయంగా అంతం చేయాలనే దురుద్దేశంతో కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైలుకు పంపినా పార్టీ వెనక్కి తగ్గలేదు. ప్రజలు మనపై నమ్మకంతో అధికారం ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది" అని అన్నారు. చంద్రబాబు అనుభవం, ప్రధాని మోదీ సహకారంతో కేవలం 20 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలమన్న ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడం, అమరావతి నిర్మాణం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.

కొన్ని సంఘటనలపై బాధ ఉన్నప్పటికీ, ప్రతిచర్య పేరుతో హింసకు దిగడం సరికాదని అచ్చెన్నాయుడు హితవు పలికారు. "తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నీచమైన కుట్రలు చేస్తోంది. వారి ఉచ్చులో పడొద్దు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. దాడులు చేయడం, హింసకు పాల్పడటం టీడీపీ సంస్కృతి కాదు" అని ఆయన స్పష్టం చేశారు. ఇక‌, స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని మరోసారి నిరూపితమైందని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం సమర్థంగా అణిచివేస్తోందని, శాంతిభద్రతల పరిరక్షణకే తమ తొలి ప్రాధాన్యత అని నేతలు భరోసా ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos