ఏపీలోని గుత్తి రైల్వే జంక్షన్‌ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. ముంబై నుంచి ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌(22159), పుదుచ్చేరి-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున సిగ్నల్‌ కేబుల్‌ కత్తిరించారు. దీంతో లోకోపైలట్‌ రైలును ఆపారు. రైలు ఆగడంతో ఐదుగురు దుండగులు రైలులోని ఎస్‌ 2 కోచ్‌ లోకి చొరబడ్డారు. అక్కడ ప్రయాణికులు కేకలు పెట్టడంతో దుండగులు ఎస్‌ 1 కోచ్‌లోకి వెళ్లి పయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాధితులు రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అదేవిధంగా గుత్తి రైల్వే జంక్షన్‌ సమీపంలో కర్నూలు జిల్లా రామలింగాయపల్లి - పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి పుదుచ్చేరి - కాచిగూడ (17654) ఎక్స్‌ప్రెస్‌ రామలింగాయపల్లి - పెండేకల్లు రైల్వేస్టేషన్‌ మధ్యలో క్రాసింగ్‌ కోసం ఆగింది. రైలులోకి దుండగులు చొరబడి ప్రయాణికల నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్ళారు. బాధితులు డోన్‌ రైల్వే స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడీ చోటు చేసుకోవడంతో రైల్వే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైల్వే రక్షణ దళం, జీఆర్‌పీ అధికారులు, పోలీసుల వైఫల్యాలతోనే దోపిడీలు జరుగుతున్నట్లు ప్రయాణికులు మండిపడుతున్నారు. దోపిడీలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos