ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కేరళ పేరును ఆ రాష్ట్ర వాసుల కోరిక మేరకు కేరళంగా మార్చడంతో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలనే డిమాండ్లు మొదలయ్యాయి. గతంలో ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ గా ఉన్న పేరును తెలుగునాడుగా మార్చేందుకు గతంలో జరిగిన ప్రయత్నాలు కూడా  ఆటోమేటిగ్గా తెరపైకి వస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ పేరును మార్చకూడదంటూ మరో వర్గం దీనికి కౌంటర్ అటాక్ ప్రారంభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ను పేరును 'తెలుగునాడు'గా మార్చాలంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. 'తెలుగునాడు'గా మార్చేందుకు ఆనాడు ఎన్టీఆర్ ప్రయత్నించారన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని, ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదని ఆయన తేల్చేశారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదని, కేరళను 'కేరళం'గా మార్చినట్లే ఆంధ్రప్రదేశ్ పేరును 'తెలుగునాడు'గా మార్చాలని గరికపాటి కోరారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు చర్చ మొదలైంది.

దీనిపై భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందంటూ ఆయన గరికపాటికి గుర్తుచేశారు. అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వింత పోకడలు, వింత ఆలోచనలు మంచిది కాదన్నారు. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదని, ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారని విమర్శలు గుప్పించారు. గరికపాటి తెలంగాణలో సెటిలయ్యారని, ఆంధ్రాకు రారని కూడా తెలిపారు. మా ప్రాంతం, మా బ్రతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసంటూ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos